సీనియర్ నటి షావుకారు జానకికి "పద్మశ్రీ"

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా ప్రకటించే పద్మ పురస్కారాల్లో 2022 ఏడాదికిగాను పద్మశ్రీ పురస్కారానికి ప్రముఖ సీనియర్ నటి షావుకారు జానకి(90) ఎంపికయ్యారు. 1931 డిసెంబర్ 12 రాజమండ్రిలోని బ్రహ్మాణ కుటుంబంలో జన్మించిన షావుకారు జానకి తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో సుమారు 450కిపై చిత్రాల్లో నటించారు. 3 వేలకుపైగా నటక ప్రదర్శనలిచ్చారు. 14 ఏళ్ల వయస్సులోనే ఆకాశవాణి మద్రాసు కేంద్రంలో రేడియో ఆర్టిస్టుగా పనిచేశారు. 1950లో ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన షావుకారు చిత్రంలో ఎన్టీఆర్ సరసన నటించి సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్నారు. ఎన్టీఆర్ , ఏఎన్నార్ , ఎంజీఆర్ , శివాజీ గణేశ్ లాంటి అగ్ర హీరోల సరసన నటించి ప్రేక్షకుల ప్రశంసలందుకున్నారు. సినీ పరిశ్రమలో నటిగా షావుకారు జానకి చేసిన సేవలకు ఇప్పటికే ఎన్నో పురస్కారాలు, జీవిత సాఫల్య పురస్కారాలు ఆమెను వరించాయి. తాజాగా తమిళనాడు నుంచి షావుకారు జానకిని కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక చేయడం విశేషం.

Post a Comment

Previous Post Next Post