ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి డాక్టర్ పద్మజారెడ్డికి "పద్మశ్రీ"

కూచిపూడి నృత్యంతో దేశవిదేశాల్లో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నాట్యకారిణి డాక్టర్ పద్మజారెడ్డిని కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక చేసింది. గత 45 ఏళ్లుగా కూచిపూడి నృత్యంలో ఎంతో మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన పద్మజారెడ్డి హైదరాబాద్ లోని అమీర్ పేటలో " ప్రణవ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డ్యాన్స్ " కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. ఈ స్కూల్ నుంచి ఇప్పటి వరకు సుమారు 500 విద్యార్థులకు కూచిపూడి నృత్యాన్ని నేర్పించారు. తెలుగు రాష్ట్రాలతోపాటు యూరప్ , ఆస్ట్రేలియా, జర్మనీ సహా పలు దేశాల్లో 3 వేలకు పైగా పద్మజారెడ్డి ప్రదర్శనలిచ్చారు. 2016లో పద్మజారెడ్డి సంగీత నాటక అకాడమీ అవార్డు కూడా అందుకున్నారు. 

Post a Comment

Previous Post Next Post