నాగార్జున, నాగచైతన్య ప్రధాన పాత్రల్లో కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన చిత్రం బంగార్రాజు. ఈ సంక్రాంతికి విడుదలై నాలుగు రోజుల్లోనే 100 కోట్ల రూపాయల క్లబ్ లో చేరింది ఈ మూవీ. ఈ సందర్భంగా రాజమహేంద్రవరంలో బంగార్రాజు థాంక్స్ మీట్ ను వేలాది మంది ప్రేక్షకుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. నాగార్జున, నాగచైతన్యతోపాటు కృతిశెట్టి సహా ఇతర నటీనటులు హాజరయ్యారు. ఏపీ మంత్రి కన్నబాబు, ఎంపీ భరత్ తోపాటు పీపుల్స్ స్టార్ ఆర్ . నారాయణమూర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలో నాగార్జున మాట్లాడుతూ... తాను బంగార్రాజును కాదని తన తండ్రి నాగేశ్వరరావు బంగార్రాజు అన్నారు. బంగార్రాజును విజయవంతం చేసిన తెలుగు ప్రేక్షకులకు పాధాభివందనం చేశారు. ఇంకా నాగార్జున ఏమన్నారంటే....
" ప్రపంచమంతా భయపడుతున్న సమయం. నార్త్ ఇండియాలో సినిమా రిలీజ్ లన్ని ఆపేశారు. అయినా సరే ఈ సంక్రాంతికి మీరు సినిమా రిలీజ్ చేయండి, మేం బ్లాక్ బస్టర్ చేస్తామని చెప్పి చూపించిన తెలుగు ప్రేక్షకులకు నా పాదాభివందనాలు. ఈ సినిమా విజయ నా నమ్మకమని మా యూనిట్ అంటోంది. కానీ నా నమ్మకం ప్రేక్షకులు. ఆ నమ్మకాన్ని నిలబెట్టారు. సినిమా అంటే సంక్రాంతి, సంక్రాంతి అంటే సినిమా అని మరోసారి రుజువు చేశారు. రాజమేంద్రవరంలో అన్ని షోలు ఇంకా హౌజ్ పుల్ కలెక్షన్లతో రన్ అవుతున్నాయని విన్నాను. నేను ఇక్కడికి కలెక్షన్స్ గురించి మాట్లాడటానికి రాలేదు. మీ ప్రేమ గురించి చెబుతామని వచ్చాను. ప్రేక్షకుల ప్రేమకు మించిన కలెక్షనే లేదు. ఈ ప్రేమను చూస్తే నేను, చైతన్య, అఖిల్ ... అక్కినేని నాగేశ్వరరావుకి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అలాగే ఇటీవల నా మిత్రుడు చిరంజీవి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిసివచ్చారు. ఆ విషయం చిరంజీవిని అడిగాను. సినీ పరిశ్రమకు అంతా మంచే జరుగుతుందని చెప్పారట. ఈ సందర్భంగా సీఎం జగన్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. బంగార్రాజు అచ్చమైన తెలుగు సినిమా. మేం కాదు బంగార్రాజు మా నాన్నగారు. ఇక్కడే ఉండి ఆయన అన్నీ చూస్తున్నారు. ఈరోజు ఎన్టీఆర్ వర్థంతి కూడా. సినీ పరిశ్రమకు ఎన్టీఆర్ , ఏఎన్నార్ రెండు కళ్లు. ఆ ఇద్దరు చిత్ర పరిశ్రమ ఉన్నంత వరకు జీవించే ఉంటారు. "
Post a Comment