సమంత, నాగచైతన్య విడాకులు తీసుకొని నాలుగు నెలల అవుతుంది. విడాకులకు కారణాలు ఇప్పటికీ బయటకు రాలేదు. ఈ విషయంపై నాగార్జున స్పందించారని ఉదయం నుంచి జోరుగా ప్రచారం జరిగింది." చై–సామ్ ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారని, నాకు తెలిసింత వరకూ విడిపోయే అంతగా సమస్య రాలేదు. సమంతే మొదట విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుని అప్లయ్ చేసింది. ఆమె నిర్ణయాన్ని గౌరవించి నాగచైతన్య అంగీకారం తెలిపాడు. నా గురించే చైతన్య ఎక్కువగా బాధపడ్డాడు. విడాకుల విషయాన్ని నేను ఎలా తీసుకుంటాను, కుటుంబ పరువు, మర్యాద ఏమైపోతుంది? అనే తను ఎక్కువగా ఆలోచించాడు.’’
అంటూ నాగార్జున పేరుతో ప్రధాన మీడియాతోపాటు వివిధ సోషల్ మీడియా వెబ్ సైట్లలో ప్రచారం జరిగింది.
తాజాగా ఈ విషయం నాగార్జున దృష్టికి వెళ్లడంతో అగ్రహించిన నాగార్జున ట్విట్టర్ వేదికగా అవన్నీ అవాస్తవాలని స్పష్టం చేశారు. సమంత-నాగచైతన్య విడాకుల అంశంపై తన పేరుతో వివిధ సామాజిక మాద్యమాలు, మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. వారిద్దరి విడాకుల అంశంపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వస్తున్నవన్ని అవాస్తవాలని కొట్టిపారేశారు. మీడియా పుకార్లను వార్తలుగా మల్చవద్దని విజ్ఞప్తి చేశారు. మీడియా న్యూస్ ఇవ్వండి, పుకార్లను కాదని నాగార్జున గట్టిగా హెచ్చరించారు.
Post a Comment