ఔను... వీళ్లిద్దరూ విడిపోయారు..!

హాలీవుడ్ నుంచి మొదలుకొని బాలీవుడ్ వయా టాలీవుడ్ వరకు ప్రేక్షకులతో ఎంతో అలరించిన కపుల్స్ ఉన్నఫలంగా తమ బంధాలకు విడాకులిచ్చుకొని అభిమానులకు షాక్ ఇస్తున్నారు. అమీర్ ఖాన్ నుంచి నాగచైతన్య వరకు విడాకుల న్యూస్ హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పుడు ఈ జాబితాలో సూపర్ స్టార్  రజినీకాంత్ అల్లుడు కూడా చేరిపోయారు. రజినీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్యతో తన 18 ఏళ్ల వైవాహిక జీవితాన్ని తెంచుకుంటున్నట్లు ధనూష్ అధికారికంగా ప్రకటించారు. ఇద్దరం వేరు వేరు దారుల్లో ప్రయాణించాలనుకుంటున్నట్లు తెలిపారు. ఇదే విషయాన్ని ఐశ్వర్య కూడా వ్యక్తం చేసింది. అయితే విడిపోవడానికి సరైన కారణాలు వెల్లడించని ధనూష్ , ఐశ్వర్యలు.... సమంత-నాగచైతన్య తరహాలోనే ఒకే లేటర్ ను ట్విట్టర్ , ఇన్ స్టాలో పోస్టు చేశారు. ఆ లేఖలో ఏముందంటే...

" 18 ఏళ్లపాటు స్నేహితులుగా, భార్యభర్తలుగా, తల్లిదండ్రులుగా, శ్రేయోభిలాషులుగా అర్థం చేసుకొని మా ప్రయాణం కొనసాగించాం. ఇప్పుడు మేము వేరువేరు దారుల్లో ప్రయాణించేందుకు సిద్ధమయ్యాం. ఐశ్వర్య, నేను విడిపోవాలని నిర్ణయం తీసుకున్నాం. వ్యక్తిగతంగా సమయం వెచ్చించాలనుకుంటున్నాం. మా నిర్ణయాన్ని దయచేసి గౌరవించండి. ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు వ్యక్తిగత గోప్యత అవసరం" 

ఉన్నఫలంగా వీరిద్దరు విడిపోవడం పట్ల కోలీవుడ్ షాక్ కు గురైంది. అగ్ర నటీనటుల కుటుంబాల నుంచి ఇలాంటి వార్తలు రావడం పట్ల అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జాతీయ పురస్కారాల వేడుకల్లో రజినీకాంత్ తోపాటు ధనూష్ , ఐశ్వర్య కలిసే వెళ్లారు. చక్కగా ఉన్నారనుకుంటే ఇలా విడిపోతున్నామనే ప్రకటన రావడం రజినీ, ధనూష్ అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ధనూష్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో సార్ సినిమాలో నటిస్తుండగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలోనూ ఓ సినిమాలో నటిస్తున్నాడు. 

Post a Comment

Previous Post Next Post