నవీన్ పొలిశెట్టి నెక్స్ట్ మూవీకి టైటిల్ ఫిక్స్
* టైటిల్: అనగనగా ఒక రాజు
* స్పెషల్ వీడియో విడుదల
ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ, జాతిరత్నాలు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన యువ నటుడు నవీన్ పొలిశెట్టి. నవీన్ కథానాయకుడిగా నటిస్తున్న మూడో చిత్రానికి టైటిల్ ఖరారు చేశారు. అనగనగా ఒక రాజు పేరుతో మరోసారి నవీన్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ చిత్రం ద్వారా కళ్యాణ్ శంకర్ అనే మరో యువ దర్శకుడు వెండితెరకు పరిచయం అవుతున్నాడు. సంక్రాంతి సందర్భంగా టైటిల్ తోపాటు ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో నవీన్ చేసిన హంగామా నవ్వులు పూయిస్తోంది. పంచెకట్టి నీలిరంగు చొక్కాలో నవీన్ చెప్పిన సంభాషణలు నవ్విస్తున్నాయి. ముఖ్యంగా తన ఫొటోలను చూసి కత్రినా- వీక్కి కౌశల్ కుళ్లు కోవాలంటూ చెప్పిన తీరు నవీన్ అనగనగా ఒక రాజు చిత్రం ఏ విధంగా ఉండబోతుందో ముందే చెప్పేశాడు. ఈ దశాబ్దానికి గుర్తుండిపోయే పెళ్లి తంతుతో నవీన్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే ఈ చిత్రంలో నవన్ సరసన అనుష్క కథానాయికగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. తనకంటే చిన్నవాడైన నవీన్ తో పెళ్లికి అనుష్క ఏ విధంగా ఒప్పుకుంటుంది, వారి మధ్య జరిగే సంఘటనలు, పరిణామాలతో ప్రేక్షకులను నవ్వించబోతున్నారు నవీన్. సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా... తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
Post a Comment