కృష్ణవంశీ రంగమార్తాండ షూటింగ్ పూర్తి
* వాయిస్ ఓవర్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి
* కొరియోగ్రఫి చేసిన ప్రకాశ్ రాజ్ సతీమణి
* రామోజీ ఫిల్మ్ సిటీలో ఏకధాటిగా 36గంటలపాటు షూటింగ్ చేసిన కృష్ణవంశీ
* మరాఠీ క్లాసిక్ నటసామ్రాట్ చిత్రానికి రిమేక్ గా రంగమార్తాండ
కరోనా కారణంగా షూటింగ్ ను వాయిదా వేసిన కృష్ణవంశీ... ఇటీవలే మళ్లీ చిత్రీకరణ ప్రారంభించారు. రామోజీఫిల్మ్ సిటీలో ఏకధాటిగా 36 గంటలపాటు ప్రకాశ్ రాజ్ తోపాటు ఇతర నటీనటులపై కీలకమైన సన్నివేశాలు, పాటలు, క్లైమాక్స్ పూర్తి చేశారు. ప్రకాశ్ రాజ్ భార్య, ప్రముఖ కొరియోగ్రాఫర్ పోనీ ప్రకాశ్ రాజ్ నేతృత్వంలో ప్రకాశ్ రాజ్, శివాత్మిక, రాహుల్ పై సూపర్ పాటను చిత్రీకరించారు. ప్రస్తుతం ఒకరోజు మినహా షూటింగ్ పూర్తి చేసుకున్న రంగమార్తాండకు సంబంధించి ఇక పోస్టు ప్రొడక్షన్ పనులు మొదలుపెడుతున్నట్లు డైరెక్టర్ కృష్ణవంశీ తెలిపారు.
చిత్రంలో రంగమార్తాండ చిత్ర కొరియోగ్రాఫర్ పోనిప్రకాశ్ రాజ్అలాగే ఈ చిత్రానికి మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ అందించడం విశేషం.
నాటకరంగం నేపథ్యంగా సాగే మరాఠీ చిత్రం నటసామ్రాట్ విషయానికొస్తే 2016 జనవరి 1న విడుదలైంది. మహేశ్ మంజ్రేకర్ దర్శకత్వంలో నానా పటేకర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ... బాక్సాఫీసు వద్ద సుమారు 40 కోట్ల రూపాయలు సాధించి అక్కడ క్లాసిక్ హిట్ గా నిలిచింది. అప్పటి వరకు సైరత్ సాధించిన వసూళ్ల రికార్డును నటసామ్రాట్ బద్దలు కొట్టింది. అప్పా పాత్రలో నానా పటేకేర్ నటన అద్భుతం. అందులోని ప్రతి పాత్రకు ఎంతో పేరు, గుర్తింపు వచ్చింది. ఉత్తమ మరాఠీ చిత్రంతోపాటు ఫిల్మ్ ఫేర్ అవార్డులు కూడా వరించాయి. మహారాష్ట్రలోనే కాకుండా యూకే, సింగపూర్, కెనడా, అమెరికాలోనూ నటసామ్రాట్ బాగా ఆడింది.
Post a Comment