ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన సోదరడు శిరీష్ తనయుడు ఆశీష్ ను హీరోగా పరిచయం చేస్తూ నిర్మించిన మూవీ రౌడీ బాయ్స్ . ఈ సంక్రాంతి బరిలో నిలిచి సగటు సినిమా అనిపించుకుంది. యూత్ ఆడియెన్స్ ను టార్గెట్ చేస్తూ రిలీజైన ఈ మూవీ కలెక్షన్స్ పరంగా తమకు ఎంతో సంతృప్తి కలిగించిందని దిల్ రాజు తెలిపారు. సంక్రాంతి విజేతగా బంగార్రాజు నిలిచాడన్నారు. ఆ సినిమా ఉండటం వల్ల రౌడీ బాయ్స్ కు ఆశించినంత వసూళ్లు రాలేదని ఆవేదన వ్యక్తం చేసిన దిల్ రాజు.... ఇంకా రెండు వారాల్లో సినిమా మంచి రెవెన్యూ సాధిస్తుందన్నారు. రౌడీ బాయ్స్ గుడ్ ఫిల్మ్ గా నిలిచిందన్నారు. ఆశీష్ తదుపరి మూవీని సుకుమార్ రైటింగ్స్ , ఎస్వీసీసీ సంయుక్తంగా నిర్మించబోతున్నాయని వెల్లడించారు. " సెల్ఫీష్ " పేరుతో రాబోతున్న ఆ మూవీకి సుకుమార్ మాటలు రాస్తుండగా ఆయన శిష్యుడు కాశి సినిమాను తెరకెక్కించనున్నట్లు దిల్ రాజు వివరించారు.
సుకుమార్ రైటింగ్స్ లో ఆశీష్ నెక్స్ట్ ఫిల్మ్ : దిల్ రాజు
DS
0
Post a Comment