కేంద్ర ప్రభుత్వం 2022 సంవత్సరానికి ప్రకటించిన పద్మ పురస్కారాల్లో కళారంగం నుంచి తెలంగాణ ప్రాంతానికి చెందిన ముగ్గురికి పద్మశ్రీలు దక్కాయి. అందులో కిన్నెర కళాకారుడు దర్శనం మొగిలయ్య, కూచిపూడి నృత్యకారిణి డాక్టర్ పద్మజారెడ్డిలతోపాటు రామచంద్రయ్య అనే మరో పేరు కూడా ఉంది. ఈ అవార్డుల వివరాలు తెలుసుకున్న సామాన్య జనం.. రామ చంద్రయ్య ఎవరనే సందేహం కలిగింది. రామచంద్రయ్య ఎవరంటే... డోలు వాయిద్యకారుడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం కూనవరం గ్రామానికి చెందినవారు. డోలు వాయిస్తూ గిరిజనుల చరిత్రను వివరించడంలో సకిని రామచంద్రయ్యకు మంచి పేరుంది. గిరిజనుల చరిత్రను దేశవ్యాప్తం చేయడంలో రామచంద్రయ్య సేవలను గుర్తించిన కేంద్రం... పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక చేసింది. అయితే పద్మ అవార్డుల ఎంపికలో కేంద్రం ఈసారి కూడా గిరిజన కళాకారులకు ప్రాధాన్యత కల్పించింది. గతేడాది గుస్సాడి నృత్యంలో ప్రావీణ్యులైన కనకరాజుకు పద్మశ్రీ ఇవ్వగా ఈ ఏడాది డోలు వాయిద్యకారుడు రామచంద్రయ్య, కిన్నెర కళాకారుడు దర్శనం మొగిలయ్యలను పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక చేయడం ఆనందించాల్సిన విషయం.
"పద్మశ్రీ" అవార్డుకు ఎంపికైన రామచంద్రయ్య ఎవరంటే..?
DS
0
Post a Comment