హైదరాబాద్ లో ఉన్న బ్యాంకు ATMలు వరుసగా చోరీకి గురవుతున్నాయి. ఈ దొంగతనాలకు పాల్పడుతుంది ప్రముఖ నిర్మాత దిల్ రాజు, స్టార్ డైరెక్టర్ హరీశ్ శంకర్ ఇంకా అతని చిత్ర బృందమని అభిమానులు గుర్తించారు. ఏంటీ ఇదంతా నిజమే అనుకుంటున్నారా? అయితే ATMలో మీ డబ్బులు ఇరుక్కున్నట్టే. ప్రముఖ ఓటీటీ సంస్థ ZEE5 కోసం దిల్ రాజు, హరీశ్ శంకర్ నిర్మాతలుగా వెబ్ సిరీస్ నిర్మిస్తున్నారు. ATM పేరుతో నిర్మించే ఈ వెబ్ సిరీస్ కు హరీశ్ శంకర్ కథను అందించగా అతని శిష్యుడు చంద్రమోహన్ స్క్రిన్ ప్లే, దర్శకత్వం వహిస్తున్నాడు. అలాగే ఈ వెబ్ సిరీస్ కు హర్షిత్ రెడ్డి, అన్షితా రెడ్డిలు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉండబోతుంది? నటీనటులు ఎవరనేది తదితర విషయాలను దిల్ రాజు, హరీశ్ శంకర్ వెల్లడించనున్నారు.
హైదరాబాద్ లో దిల్ రాజు, హరీశ్ శంకర్ ల "ATM " చోరీ
DS
0
Post a Comment