ఇటీవల కరోనా భారినపడిన మెగాస్టార్ చిరంజీవి త్వరగా కోలుకోవాలని అభిమానులు పెద్ద ఎత్తున ఆకాంక్షిస్తున్నారు. ఈ క్రమంలో విషయం తెలుసుకున్న
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్ , జగన్మోహన్ రెడ్డిలు ప్రత్యేకంగా ఫోన్ చేసి పరామర్శించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ సుమారు 20 నిమిషాలపాటు చిరంజీవితో మాట్లాడారు. ఆరోగ్య వివరాలతోపాటు సినీ పరిశ్రమ గురించి కూడా కేసీఆర్ వాకాబు చేసినట్లు చిరంజీవి వ్యక్తిగత సిబ్బంది తెలిపారు. అలాగే ఏపీ సీఎం జగన్ కూడా చిరుతో ప్రత్యేకంగా ఫోన్లో మాట్లాడారు. అన్న అంటూ చిరంజీవిని ఆప్యాయంగా పలకరించే జగన్ .. సుమారు 25 నిమిషాలపాటు చిరుతో మాట్లాడారు. త్వరగా కొవిడ్ నుంచి కోలుకోవాలని జగన్ ఆకాంక్షించారు. ఇటీవలే సినీ పరిశ్రమలోని టికెట్ ధరల వివాదం, థియేటర్ల సమస్యలపై చిరంజీవి.. ముఖ్యమంత్రి జగన్ తో చర్చించి ఆ సమస్యను పరిష్కారం దిశగా తీసుకెళ్లిన విషయం తెలిసిందే.
Post a Comment