వేదికపైకి చెప్పుల్లేకుండా బాలయ్య

బాలకృష్ణ అంటే ఎలాంటి వాడో ఆయన అభిమానులకు, ఆయన్ని ప్రేమించే వ్యక్తులకు వేరే చెప్పక్కర్లేదు. మంచికి మంచి... చెడుకు చెడు బాలయ్య నైజం. అలాంటి బాలయ్య తన సినిమాను ఎంత ప్రేమిస్తారో.. తెలుగు ప్రేక్షకులను అంతే ఆరాధిస్తారు. బాలయ్య తన తాజా చిత్రం అఖండ ఘన విజయం సాధించిన క్రమంలో హైదరాబాద్ లో విజయోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకకు పంచెకట్టులో వచ్చిన బాలయ్య... చెప్పులు లేకుండా వేదికపైకి రావడం సినిమా వేదికను ఎంత ప్రేమిస్తారో అర్థమవుతుంది. బాలయ్య అలా రావడం మిగతా నటీనటులు కూడా చాలా ఆశ్చర్యపోయారు. దటీజ్ బాలయ్య.... 

Post a Comment

Previous Post Next Post