నా సినిమా పాకిస్థాన్ లోనూ చెలరేగిపోతుంది




నందమూరి బాలకృష్ణ, బోయపాటి కలయికలో విడుదలై సంచలన విజయం సాధించిన మరో చిత్రం అఖండ. ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ ను పురస్కరించుకొని మాట్లాడిన బాలకృష్ణ... అఖండ చిత్రం పాన్ ఇండియా లెవల్ లోనే కాకుండా ప్రపంచస్థాయిలో దూసుకెళ్లిందన్నారు. పాకిస్థాన్ లోనూ అఖండ చెలరేగిపోయిందన్నారు. అక్కడి నుంచి కూడా తనకు వాట్సప్ వీడియోలు వచ్చాయని ఆనందం వ్యక్తం చేశారు. అన్ సీజన్ లో అఖండ విడుదల చేసినా ఊహించని విజయాన్ని అందుకుందన్నారు. కొత్తరకం సినిమాలను ఆదరించే ప్రేక్షకులు తెలుగువారు మాత్రమేనన్న బాలయ్య.. అఖండ చిత్ర పరిశ్రమకు ధైర్యాన్ని ఇచ్చిందన్నారు.  ప్రేక్షకులు ఎలాంటి సినిమాలు కోరుకుంటున్నారో అఖండ నిరూపించిందన్నారు. అలాంటి సినిమాలను బోయపాటి, నేను తప్పకుండా ఇస్తామన్నారు. 

Post a Comment

Previous Post Next Post