ఓటీటీలోనూ "అఖండ"మైన విజయం

బాలకృష్ణ, బోయపాటి కలయికలో విడుదలై సంచలన విజయాన్ని అందుకున్న అఖండ మూవీ ఓటీటీలోనూ అదేజోరు కొనసాగిస్తోంది. విడుదలైన 24 గంటల్లో డీస్నీ ప్లస్ హాట్ స్టార్ లో 1 మిలియన్ ప్రేక్షకులు అఖండను వీక్షించారు. సినిమా చూస్తున్న దృశ్యాలను సామాజిక మాద్యమాల్లో పంచుకుంటూ ఆనందించారు. థియేటర్ లోనే కాకుండా ఇళ్లల్లోనూ జై బాలయ్య నినాదాలు మారుమోగాయి. అఖండ థియేటర్ లో 50 రోజులు పూర్తి చేసుకొని రూ.200కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. ఇంకా థియేటర్లలో అఖండ ప్రదర్శితమవుతుండగానే సినిమాను ఓటీటీలో విడుదల చేశారు. అఘోరగా బాలయ్య ఉగ్రరూపం, బోయపాటి టేకింగ్ , కథ, కథనాలు, పాటలు, ఫైట్లు.. అన్ని రకాలుగా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఓటీటీలోనూ బాలకృష్ణ అఖండ అన్ స్టాపబుల్ గా దూసుకుపోతోంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీకి కూడా పెద్ద పండుగ తీసుకొచ్చింది. అంతేకాకుండా ఇప్పటి వరకు ఓటీటీలో విడుదలైన తెలుగు సినిమాల్లో 24 గంటల వ్యవధిలో 1 మిలియన్  వ్యూస్ సాధించిన చిత్రంగా అఖండ కొత్త రికార్డు సృష్టించింది. 

Post a Comment

Previous Post Next Post