RRR విడుదల ఎప్పుడంటే....!

దర్శక దిగ్గజం రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందించిన RRR (రణం రౌద్రం రుధిరం) విడుదల తేదీపై ఓ స్పష్టత వచ్చింది. కరోనా పరిస్థితులు తగ్గి థియేటర్లు పూర్తి సామర్థ్యంతో నడిచినప్పుడే RRR విడుదల చేస్తామని ఆ మూవీ టీం అధికారికంగా ప్రకటించింది. అంతేకాకుండా పరిస్థితులకు అనుగుణంగా రెండు విడుదల తేదీలను కూడా వెల్లడించింది. మార్చి 18 లేదా ఏప్రిల్ 28న RRRను విడుదల చేస్తామని తెలిపింది. ఇప్పటికే నాలుగు సార్లు వాయిదా పడిన RRR మార్చిలో కూడా విడుదల కష్టమనే వాదన వినిపిస్తోంది. మరోవైపు ఫిబ్రవరి నెలాఖరు కల్లా ఈ ప్యాండమిక్ ఎండమిక్ కానుందని వైద్య వర్గాలు భావిస్తున్నాయి. కానీ రోజురోజు కేసులు సంఖ్య మరింత పెరుగుతుండటం ప్రజలను కలవరపెడుతున్నాయి. దీంతో ప్రజలు బయటికిరావడానికి ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో రాజమౌళి టీం ధైర్యం చేసి రెండు తేదీలను ప్రకటించింది. అయితే మార్చి 18నే ఈ చిత్రం విడుదలైన మిగతా సినిమాలకు మంచి అవకాశం దొరుకుతుంది. లేదంటే ఏప్రిల్ కు వెళ్తే మళ్లీ గందగోళ పరిస్థితులు తప్పవు. ఇప్పటికే ఫిబ్రవరిలో విడుదల కావాల్సిన ఆచార్య ఏప్రిల్ 1కి వాయిదా పడింది. ఏదేమైనా RRR త్వరగా విడుదల కావాలని ప్రపంచ సినిమా వెయ్యికళ్లతో ఎదురుచూస్తోంది. 

Post a Comment

Previous Post Next Post