ఖమ్మం ఖిల్లాపై భారీ ఎన్టీఆర్ విగ్రహం

* మే 28న ఆవిష్కరించనున్న జూనియర్ ఎన్టీఆర్ 
 * రూ.2.3 కోట్లతో ఎన్టీఆర్ విగ్రహం తయారు
* శ్రీకృష్ణుడి అవతారంలో దర్శనమివ్వనున్న నటసార్వభౌముడు

ఖమ్మం జిల్లాలో నవరస నటసార్వభౌముడు  నందమూరి తారకరాముడు దర్శనం ఇవ్వబోతున్నాడు. నగరంలోని లాకారం టాక్ బండ్ పై 54 అడుగుల ఎత్తులో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నేతృత్వంలో సుమారు రూ.2.3కోట్ల రూపాయలతో ఎన్టీఆర్ విగ్రహాన్ని తీర్చిదిద్దుతున్నారు. నిజామాబాద్ కు చెందిన వర్మ అనే కళాకారుడు ఎన్టీఆర్ విగ్రహాన్ని తయారుచేస్తున్నాడు. మయాబజార్ , శ్రీకృష్ణ తులభారంలో కృష్ణుడి పాత్రలో ఎన్టీఆర్ ఏ విధంగా అయితే కనిపిస్తారో అచ్చం అదే రూపంలో భారీ విగ్రహాన్ని తయారు చేస్తున్నారు. ప్రస్తుతం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. 

మే 28న ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా భారీ ఎత్తున విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తాత విగ్రహావిష్కరణకు ముఖ్య అతిథిగా వచ్చేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. 
ఇప్పటికే రోప్ బ్రిడ్జి ఏర్పాటుతో ఖమ్మం సిగలో మణిహారంగా మారిన లాకారం ట్యాక్ బండ్  ఎన్టీఆర్ భారీ విగ్రహం ఏర్పాటు చేస్తుండటంతో మరింత ఆకర్షణీయంగా, శోభాయమానంగా మారనుంది. అయితే ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటులో ఎలాంటి రాజకీయాలు లేవని, నటుడిగా ఆయనపై ఉన్న అభిమానంతోనే విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి పువ్వాడ స్పష్టం చేశారు. 

Post a Comment

Previous Post Next Post