టాలీవుడ్ కోసం ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఇవే

 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి పచ్చజెండా ఊపింది. చిరంజీవి అధ్యక్షతన ప్రభాస్, మహేశ్ బాబు, రాజమౌళి, కొరటాల శివ, ఆర్. నారాయణమూర్తి, అలీ, పోసాని కృష్ణమురళీలతో సమావేశమైన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి... సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను మెగాస్టార్ చిరంజీవి, సినిమాటోగ్రఫి మంత్రి పేర్ని నాని తెలిపారు. అందులో భాగంగా వైజాగ్ కేంద్రంగా చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కావల్సిన సహకారాన్ని అందించనున్నట్లు తెలిపారు. సినిమా షూటింగ్ ల కోసం అవసరమైన స్టూడియోల నిర్మాణానికి ప్రోత్సహకాలు అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే భారీ బడ్జెట్ చిత్రాలకు ప్రత్యేక రాయితీ కల్పించేందుకు కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. సగటు సినిమాలు కూడా ఆడాలనే ఉద్దేశంతో చిన్న సినిమాలకు ఐదో ఆట ప్రదర్శనకు ఆమోదం తెలిపారు. ఇక సినీ పరిశ్రమ గత ఆరేడు నెలల నుంచి పోరాడుతున్న టికెట్ ధరల తగ్గింపుపై ముఖ్యమంత్రి దృష్టి సారించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ రిపోర్ట్ కు అనుగుణంగా టికెట్ ధరలను పెంచుతూ ఈ మూడోవారంలో జీవో జారీ చేయనున్నారు. 




Post a Comment

Previous Post Next Post