భారత సినీ చరిత్రలో గాయనిగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న లతా మంగేష్కర్ తుదిశ్వాస విడిచారు. కరోనా బారినపడిన ఆమె జనవరి 8న ముంబయిలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేరారు. ఐసీయూలో చికిత్స అందించిన క్రమంలో కొద్ది రోజులకు కోలుకున్నారు. అయితే.. శ్వాస సంబంధిత సమస్య తీవ్రమవటం వల్ల 28 రోజుల చికిత్స అనంతరం ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచినట్లు ఆమె సోదరి ఉషా మంగేష్కర్ వెల్లడించారు.
లతా మంగేష్కర్.. 1929 సెప్టెంబరు 28న మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జన్మించారు. లతా మంగేష్కర్ తల్లిదండ్రులు దీనానాథ్ మంగేష్కర్, శుద్దమతిల మొదటి సంతానం. ఐదేళ్ల వయసులోనే తండ్రి దగ్గర సంగీతంలో ఓనమాలు నేర్చుకున్నారు. 13 ఏళ్ల వయసులో తండ్రి మరణంతో సినీ రంగంలోకి 1942లో నేపథ్య గాయనిగా ప్రవేశించారు. దేశ విభజనలో ఖుర్షీద్, నుర్జహాన్ వంటి ప్రముఖ గాయకులు పాకిస్థాన్ వెళ్లిపోవడం వల్ల లతా మంగేష్కర్ దశ తిరిగింది. స్టార్ సింగర్‌గా పేరు తెచ్చుకున్నారు. లతా మంగేష్కర్ పాడిన తొలి పాటను సినిమా నుంచి తొలగించారు.(మరాఠి చిత్రం కోసం). మహల్'(1949) సినిమాలోని ఆయేగా ఆనే వాలా పాటతో లతా కెరీర్ మలుపు తిరిగింది. సొంత నిర్మాణ సంస్థలోని తెరకెక్కించిన 'లేఖిని' సినిమాలోని పాట జాతీయ అవార్డును లతాను వరించింది. 1948-78 మధ్య 30 వేలకు పైగా పాటలు పాడి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో చోటు దక్కించుకున్నారు. మొత్తంగా 980 చిత్రాలకు గాత్రాన్ని అందించారు. 36 భాషల్లో 50 వేలకు పైగా పాటలు పాడారు.
1969లో పద్మభూషణ్, 1999లో పద్మ విభూషణ్, 2001లో భారతరత్న పురస్కారాలు సొంతం చేసుకున్నారు లతా మంగేష్కర్. 1963 భారత్-చైనా యుద్ధ సమయంలో లతా పాడిన అయే మేరే వతన్ కే లోగో పాట విని అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కన్నీళ్లు పెట్టుకున్నారు.1962లో లతాపై విషప్రయోగం జరిగింది. చేసిందెవరో ఇప్పటికీ తెలియలేదు.
Post a Comment