టాలీవుడ్ భళ్లాలదేవుడు దగ్గుబాటి రానా తమ్ముడు, సురేష్ ప్రొడక్షన్స్ అధినేత నిర్మాత సురేష్ బాబు తనయుడు అభిరామ్ తెలుగు తెరపై హీరోగా పరిచయం అవుతున్నాడు. సెన్సేషన్ డైరెక్టర్ తేజ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్నాడు. తేజ పుట్టినరోజును పురస్కరించుకొని అభిరామ్ ఫస్ట్ లుక్ తోపాటు టైటిల్ ని విడుదల చేశారు. సినిమాకు "అహింస" అని పేరు పెట్టారు. బాగా కొట్టి గోనెసంచిలో పెట్టిన అభిరామ్ నోట్లో నుంచి రక్తం కారుతున్న ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసి అహింసపై ఆసక్తిని రేకెత్తించారు. " అహింసా పరమో ధర్మః, ధర్మహింసా తధైవచ !!" లైన్ తో సినిమా కథ ఉంటుందని మూవీ టీం స్పష్టం చేసింది. ఇప్పటికే ప్రాథమికంగా షూటింగ్ పూర్తి చేసుకున్న అహింసకు చంద్రబోస్ సాహిత్యాన్ని సమకూర్చగా ఆర్పీ పట్నాయక్ సంగీతాన్ని అందిస్తున్నారు.
Post a Comment