మెగాస్టార్ ను డైరెక్ట్ చేయబోతున్న సుకుమార్ ..!

మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే ప్రతి నిర్మాత, దర్శకుడు ఆశ పడుతుంటారు. చిరు సినిమాలో చిన్న పాత్రైనా చాలు అదే అదృష్టంగా భావించే ఔత్సాహిక నటీనలెంతో మంది. ఇప్పుడు అలాంటి అవకాశాన్నే అందిపుచ్చుకొని తన కలను నెరవేర్చుకోబోతున్నాడు స్టార్ డైరెక్టర్ సుకుమార్ . సుకుమార్ దర్శకత్వంలో నటించేందుకు చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఈ విషయాన్ని స్వయంగా సుకుమార్ వెల్లడించారు. చిరుతో దిగిన ఫోటోను కూడా అభిమానులకు షేర్ చేశారు. తన అభిమాన నటుడికి యాక్షన్ చెప్పబోతుండటం పట్ల ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. అయితే సుకుమార్ చిరుతో సినిమా తీస్తున్నారా లేక ఏదైన కమర్షియల్ యాడ్ చేస్తున్నారా అనేది కొద్దిరోజుల్లో తేలనుంది. ఒకవేళ సినిమా అయితే... ఇద్దరి బిజీ షెడ్యూల్ లో ఎవరికి ఖాళీ లేదు. సుకుమార్ పుష్ప2 షూటింగ్ మొదలుపెట్టే పనిలో ఉండగా చిరంజీవి తాను అంగీకరించిన మూడు సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు. పుష్ప తర్వాత సుకుమార్ విజయ్ దేవరకొండతో సినిమా చేయాల్సి ఉంది. 

Post a Comment

Previous Post Next Post