బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో మూడో చిత్రంగా 2021 డిసెంబర్ 2 విడుదలైన అఖండ మూవీ సంచలనం సృష్టించింది. ప్రతికూల పరిస్థితుల్లోనూ 103 కేంద్రాల్లో విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఇంకా పలుచోట్ల అభిమానుల సందడితో సక్సెస్ పుల్ గా రన్ అవుతోంది. అయితే 50 రోజుల్లో అఖండ సాధించిన వసూళ్లపై సినీ వర్గాల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేస్తూ చిత్ర బృందం లెక్కలను బయటపెట్టింది. అధికారికంగా అఖండ చిత్రం మొత్తం ఇప్పటి వరకు రూ.200 కోట్లు వసూళ్లు సాధించినట్లుగా వెల్లడించింది. కరోనా ఉద్ధృతి పెరగడం, థియేటర్లపై ఆంక్షలు, టికెట్ ధరలు తగ్గించినా కూడా బాలయ్య తన సింహా గర్జన కొనసాగించారు. మరోవైపు జనవరి 21 నుంచి అఖండ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
Post a Comment