మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తండ్రి కాబోతున్నాడు. ఉపాసన చరణ్ దంపతులు త్వరలో తమ తొలిబిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ప్రకటించాడు. హనుమాజ్ జీ ఆశీస్సులతో ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నట్లు చిరు ట్వీట్ చేశారు. బాల హనుమంతుడి ఫోటో పెట్టి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. 2012లో రామ్ చరణ్ ఉపాసనను పెళ్లి చేసుకున్నారు. పదేళ్ల తర్వాత ఉపాసన తల్లి కాబోతుండటంతో మెగా కుటుంబంలో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే చరణ్ - ఉపాసన దంపతులు మగ బిడ్డకు జన్మనిస్తారా లేక ఆడపిల్లను కంటారా అనే దానిపై సోషల్ మీడియాలో తెగ చర్చ మొదలైంది. ఆ విషయం పక్కన పెడితే చరణ్ తండ్రి అవుతున్న విషయం తెలిసీ సినీమా ఇండస్ట్రీ ఫుల్ హ్యాపీగా ఫీలవుతుంది.
Post a Comment