మహానటి ఫేమ్ కీర్తి సురేష్ కరోనా భారినపడింది. తనకు స్వల్ప లక్షణాలతో కొవిడ్ నిర్దారణ అయినట్లు ట్వి్ట్టర్ ద్వారా కీర్తి వెల్లడించింది. ప్రస్తుతం తాను ఐసోసేషన్ లో ఉన్నానని, తనను ఇటీవల కలిసిన వారంతా కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని కోరింది. కరోనా చాలా వేగంగా వ్యాప్తి చెందుతుందని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కీర్తి విజ్ఞప్తి చేసింది. ఒకవేళ ఇప్పటి వరకు వ్యాక్సిన్ తీసుకోని వారు ఎవరైనా ఉంటే వెంటనే వ్యాక్సిన్ తీసుకోవాలని, తద్వారా కరోనా తీవ్రత నుంచి బయటపడవచ్చని కోరింది. వ్యాక్సిన్ తీసుకుంటే మన కోసమే కాకుండా మనల్ని ప్రేమించే వాళ్ల కోసం కూడా ఆరోగ్యంగా ఉండవచ్చని కీర్తి తెలిపింది. త్వరలోనే తాను పూర్తిగా కోలుకుంటానని వెల్లడించింది. మహేశ్ బాబు తో కలిసి సర్కారువారి పాట చిత్రంలో నటించిన కీర్తి... భోళా శంకర్ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవికి సోదరిగా నటిస్తోంది.
Post a Comment