నన్ను ముద్దుపెట్టుకుంది అశీష్ కాదు

 



దిల్ రాజు సోదరుడు శిరీష్ తనయుడు ఆశీష్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం రౌడీ బాయ్స్. ఆశీష్ సరసన స్టార్ హీరోయిన్ అనుపమ నటించింది. జనవరి 14న ఈ చిత్రం రిలీజ్ కానుంది. రీసెంట్ గా ఈ సినిమా ట్రైలర్ ను ఎన్టీఆర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ లో ఆశీష్ ను అనుపమ ముద్దుపెట్టుకునే సీన్ ఉంది. ఆ సీన్ పై సోషల్ మీడియాలో తెగ మీమ్స్ ట్రోల్ అయ్యాయి. ఆ మీమ్స్ పై అశీష్, అనుపమ స్పందించి ఒక వీడియో రిలీజ్ చేశారు. 
అందులో ఏముందంటే.... 
కావ్య(అనుపమ)ను అశీష్ మీమ్స్ చూద్దామని పిలుస్తాడు. 
మొదట వద్దని వారించినా.... సరే చూద్దామంటోంది కావ్య. 

1. బ్రహ్మానందం రియాక్షన్ మీమ్
అశీష్ ః అనూ...!
అనుః చూశావా...? ఇంత ప్రేమను చూశావా?
అశీష్ః నీ ఫ్యాన్స్ అమ్మా... ! నన్ను బయట కనిపిస్తే కొట్టేటట్టున్నారు... తెలుసా..!!
అనుః (నవ్వులు)

2. ఏంటీ అనుపమ ఇది
అనుః ఏంటీ అనుపమ ఇది అని చెప్పి ఒక ఫైర్ ఎమోజీ పెట్టారు. ఏ సారీ సారీ... ఇంక నేను అశీష్ ను టచ్ చేయను. ప్రామిస్. 
అశీష్ః హ్యాపీయా... అందరు
అనుః నవ్వులు

3. తమ్ముడు
అశీష్ః తమ్ముడూడూడూడూ.....
అనుః నవ్వులు.... ఏ విజయ్... వీడీ
అశీష్ః థాంక్స్ ఎట్లీస్ట్ విజయ్ తో అన్న కంపైర్ చేశారు. ఐ యామ్ హ్యాపీ గాయ్స్

4. ఏమైపోవాలి ఈ పసివాళ్ల హృదయాలు
అనుః అయ్యో ఈ చిన్నోన్ని చూడు... 
అశీష్ః వాడు పాపం తల పీకేసుకుంటున్నాడు 
అనుః నీవల్ల ఎంత మంది హార్ట్ అవుతున్నారో చూశావా !
అశీష్ః నా వల్లా.... ?
అనుః నీ వల్లే.... నువ్వే కదా ముద్దు పెట్టావ్. అందుకే అందుకే హర్ట్ అవుతున్నారు
అశీష్ః హలో... అది అక్షయ్ అమ్మ. నేను కాదు. అనుపమను కాదు ముద్దుపెట్టుకుంది కావ్యను
అనుః నన్ను ముద్దుపెట్టుకుంది అశీష్ కాదు... అక్షయ్. సో మీరు క్షమించాలి. 
అశీష్ః తను అనుపమ కాదు... కావ్య... అర్థం చేసుకోవాలి. 

5. ఇది చూడటానికేరా... నేను బతికుంది
అనుః హహహహహహ.... ( కిస్ చేస్తు్న్న ఫొటోపై నిబ్బ నిబ్బా అని ఉంది). ఈ నిబ్బ నిబ్బ అంటే ఏంటీ?
అశీష్ః నిబ్బ నిబ్బ అంటే పరిపక్వత.
అనుః ఫిల్మ్ చూశాక మీకు ఆ పరిక్వత ఏంటో తెలుస్తుంది. 
అశీష్ః సో... జనవరి 14న అందరు మాస్క్ వేసుకొని జాగ్రత్తగా అనుపమ కోసం మా కోసం సినిమా చూడండి. 
అనుః రౌడీ బాయ్స్ కోసం రండి. 

.....రేజ్ యువర్ వాయిస్... మేక్ సమ్ నాయిస్... వీ ఆర్ ది రౌడీ బాయ్స్....

Post a Comment

Previous Post Next Post