ఏపీలో రాత్రి కర్ఫ్యూ అమల్లో మార్పు


 కరోనా కేసుల ఉద్ధృతితో ఏపీ ప్రభుత్వం ఇవాళ రాత్రి నుంచి అమలు చేయాల్సిన నైట్ కర్ఫ్యూ ను వాయిదా వేసింది. సంక్రాంతి తర్వాత రాత్రి కర్ఫ్యూ అమలు చేయాలని నిర్ణయించింది. ఈ నెల 18 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రాత్రి కర్ఫ్యూ అమల్లోకి రానుంది. ఈ మేరకు కర్ఫ్యూపై జారీ చేసిన ఉత్తర్వులను ప్రభుత్వం సవరించింది. పండుగ సమయంలో పల్లెలకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివస్తున్న క్రమంలో ఇబ్బందులు తలెత్తుతన్నాయన్న పోలీసు వర్గాల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా కర్ఫ్యూను 18 నుంచి అమలు చేయాలని తుది నిర్ణయం తీసుకుంది. 


Post a Comment

Previous Post Next Post