"హీరో" మూవీకి మహేశ్ బాబు రివ్యూ

 


సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేశ్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం హీరో. శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. సంక్రాంతి కానుకగా జనవరి 15న ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా హీరో చిత్రాన్ని ముందుగానే వీక్షించిన మహేశ్ బాబు... తన మేనల్లుడ్ని ఈ సంక్రాంతికి హీరోగా పరిచయం చేస్తున్నట్లు తెలిపారు. తన తండ్రి అభిమానులు, తన అభిమానులు అశోక్ ను ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. హీరో చిత్రాన్ని చూశానని, చాలా బాగా నచ్చిందన్నారు. 

ఇంకా మహేశ్ బాబు ఏమన్నారంటే....

" నేను సినిమా చూశాను. నాకు విపరీతంగా నచ్చింది. కంగ్రాట్స్ టు ఎంటైర్ టీమ్. ప్రత్యేకంగా అశోక్ కు నేను కంగ్రాట్స్ చేస్తున్నాను. నువ్వు లేకపోతే సినిమా లేదు. చాలా బాగా చేశావ్. ఐదారేళ్ల నుంచి నువ్వు పడిన కష్టం ఈ సినిమాలో కనిపించింది. అశోక్ నిన్ను చూస్తే గర్వంగా ఉంది. నీకు రేపు చాలా కీలకమైన రోజు. కష్టపడితే విజయం వస్తుందని నేను ఎప్పుడు నమ్ముతాను. ఐయామ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ అశోక్. ఈ సినిమాకు పనిచేసిన దర్శకుడు శ్రీరామ్ ఆదిత్యతోపాటు టీమ్ అందరికి ఆల్ ది బెస్ట్. సంక్రాంతి పండుగ అనేది నాన్నగారికి బాగా కలిసొచ్చిన పండుగ. సంక్రాంతికి ఆయన సినిమా రిలీజ్ అయితే అది బ్లాక్ బస్టరే. ఆ సెంటిమెంట్ నాక్కూడా కంటిన్యూ అయింది. పండగకు రిలీజ్ అయిన నా సినిమాలన్నీ ఒక్కడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సరిలేరు నీకెవ్వరు బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. ఈ సంక్రాంతికి మా కుటుంబం నుంచి మరో హీరో పరిచయం అవుతున్నాడు. తనే నా మేనల్లుడు అశోక్. నాన్నగారి అభిమానులు, నా అభిమానులు అశోక్ ను ఆదరించాలని, హీరో సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను." 

Post a Comment

Previous Post Next Post