ఆ సీసా నా వెంట ఉండాల్సిందేః పూజా హెగ్డే

 

పూజా హెగ్డే. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు లక్కీ గల్ అనిపించుకుంటున్న టాప్ హీరోయిన్. వరుస సినిమాలతో తీరిక లేకుండా గడుపుతున్న పూజాకు ఓ అలవాటు ఉందని తెలిసింది. ఆ విషయాన్ని స్వయంగా పూజానే తెలిపింది. విమానంలో ఎక్కువ సేపు ప్రయాణించాల్సి వచ్చినప్పుడు లేదా రోడ్ జర్నీకి వెళ్లినప్పుడు తన వెంట తప్పనిసరిగా మజా బాటిల్స్ ఉండాల్సిందేనట. మజా తాగితే కాని షూటింగ్ లో స్థిమితంగా ఉండలేనంటోంది. అన్నట్టు ఈ అమ్మడు మన తెలుగు రాష్ట్రాల్లో మజా బ్రాండ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. ఈ సందర్భంగా మజాతో చిన్నప్పటి నుంచి తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న పూజా హెగ్డె.... ఒకరకంగా తను బాల్యమంతా మజాతోనే గడిచిందని తెలిపింది. చిన్నప్పడు స్నేహితుల బర్త్ డే పార్టీలకు వెళ్లినప్పుడు తప్పకుండా మజా రుచి చూడకుండా వచ్చేదాన్ని కాదని, అప్పడప్పుడు అమ్మచేత చివాట్లు కూడా తిన్నట్లు గుర్తుచేసుకుంది. అలాంటి మజా కూల్ డ్రింక్ కు ఇప్పుడు తానే బ్రాండ్ అంబాసిడర్ అవడం తన చిన్ననాటి కల నిజమైందని ఆనందం వ్యక్తం చేసింది. తెలుగు రాష్ట్రాల ప్రజలు తనను ఎంతగానో ఆదరించి ఆగ్ర హీరోయిన్ గా నిలబెట్టారని, ఇప్పుడు తాను అంబాసిడర్ గా ఉన్న మజాను కూడా అదే స్థాయిలో తీసుకెళ్తారనే నమ్మకాన్ని పూజా వ్యక్తం చేసింది. అన్నట్లు ఈ సీజన్ లో తనకు తెలిసిన స్నేహితులు, బంధువులందరికి మజా సీసాల బాక్స్ లను పెద్ద ఎత్తున పంచనున్నట్లు కూడా తెలిపింది. అయితే మజా బ్రాండ్ అంబాసిడర్ గా లెజండ్రీ యాక్టర్ అమితాబచ్చన్ తో యాడ్ లో నటించడం ఎంతో గొప్ప అనుభూతిని కలిగించిందని పూజా సంతోషం వ్యక్తం చేసింది. 
మరోవైపు ప్రభాస్ తో కలిసిన పూజా నటించిన రాధేశ్యామ్ కరోనా కారణంగా వాయిదా పడింది. ఆ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు పూజా తెలిపింది. రాధేశ్యామ్ లో ప్రేరణగా పూజా హెగ్డే నటించింది. అలాగే చిరంజీవి ఆచార్య చిత్రంలో రామ్ చరణ్ కు జోడిగా నటించిన పూజా.. నీలాంబరిలో సందడి చేసేందుకు ఏప్రిల్ 1న రాబోతుంది. 

Post a Comment

Previous Post Next Post