ప్రముఖ నేపథ్య గాయనీ, భారతరత్న లతా మంగేష్కర్ కరోనా భారినపడ్డారు. స్వల్ప లక్షణాలతో కరోనా నిర్దారణ కావడంతో కుటుంబసభ్యులు ఆమెను ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం లతా మంగేష్కర్ కు ఐసీయూలో ఉంచి వైద్యులు కొవిడ్ చికిత్స అందిస్తున్నారు. 92 ఏళ్ల వయస్సున్న లతా మంగేష్కర్ కొవిడ్ భారినపడటంతో వయస్సు రీత్యా ముందు జాగ్రత్తగా కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం లతా ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని కుటుంబసభ్యులు తెలిపారు. దాదాపు 20 భాషల్లో 50 వేలకుపైగా లతా మంగేష్కర్ పాటలు పాడారు. హిందీ చిత్రసీమలో లతా పాటలు నాటికి నేటికి శ్రోతలను అలరిస్తూనే ఉన్నాయి.
Post a Comment