ఆర్ ఆర్ ఆర్ వాయిదా పడటం పట్ల రామ్ చరణ్ ఉద్వేగానికి లోనయ్యారు. జనవరి 7న విడుదలై సంక్రాంతి బరిలో ఉండాల్సిన సినిమా కరోనా కేసుల ఉద్దృతి దృష్ట్యా అనూహ్యంగా సినిమాను వాయిదా వేస్తూ దర్శకుడు రాజమౌళి, నిర్మాత దానయ్య నిర్ణయం తీసుకున్నారు. అయితే మళ్లీ ఎప్పుడు విడుదల చేస్తామని ప్రకటించలేదు. అప్పటి వరకు విస్తృత స్థాయిలో ప్రమోషన్ చేసిన రామ్ చరణ్ , ఎన్టీఆర్ .. సినిమా వాయిదా వేయడంతో నిరాశకు లోనయ్యారు. అభిమానులు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ప్రముఖ నిర్మాత శిరీష్ తనయుడు ఆశీష్ హీరోగా పరిచయం అవుతున్న రౌడీ బాయ్స్ మ్యూజికల్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఆశీష్ కు ఆల్ ది బెస్ట్ చెబుతూ.... ఆర్ ఆర్ ఆర్ వాయిదాపై స్పందించాడు. గద్గద స్వరంతో మాట్లాడుతూ...
" ఈ సంక్రాంతికి మా సినిమా రాకపోయినా మాకేం బాధలేదు. ఎందుకంటే సరైన సమయంలో రావాలి సినిమా. ఆర్ ఆర్ ఆర్ కోసం మూడున్నరేళ్లు కష్టపడ్డాం. సరైన సమయంలో ఆర్ ఆర్ ఆర్ ను విడుదల చేసేందుకు మా పెద్దలు రాజమౌళిగారు, దానయ్యగారు కృషి చేస్తున్నారు. మా సినిమాను ఆదరించేందుకు ప్రతి ఫంక్షన్ కు వచ్చిన ఫ్యాన్స్ కు కృతజ్ఞతలు" అంటూ రామ్ చరణ్ భావోద్వేగానికిలోనయ్యారు.
Post a Comment