జగన్ తో చిరుకు మంచి ర్యాపో ఉంది : నాగార్జున

తెలుగు సినీ పరిశ్రమలో నెలకొన్న సినిమా టికెట్ల వివాదానికి ముగింపు పలికేందుకు మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగారు. ఇటీవల కొన్ని రోజులుగా ఈ వివాదం మరింత ముదిరి కులాలు, ప్రాంతాల వరకు వెళ్లడంతో సినీ పరిశ్రమకు సానా కష్టమవుతుందని భావించిన మెగాస్టార్ ... ఎట్టకేలకు ముఖ్యమంత్రి జగన్ తో సమావేశానికి సమయాన్ని నిర్దేషించుకున్నారు. ఈ క్రమంలో తాడేపల్లి గూడెంలోని క్యాంపు కార్యాలయంలో చిరంజీవి మఖ్యమంత్రితో సమావేశమయ్యారు. జగన్ , చిరంజీవిల భేటీపై అక్కినేని నాగార్జున స్పందించారు. చిరంజీవి తానొక్కడికోసం వెళ్లలేదని, అందరి మంచి కోసం వెళ్లాడన్నారు. బంగార్రాజు సినిమా విడుదలతో బిజీగా ఉండటం వల్ల తాను చిరంజీవితో కలిసి వెళ్లలేదని స్పష్టం చేశారు. చిరంజీవికి జగన్ కు మంచి సాన్నిహిత సంబంధాలు ఉన్నాయన్న నాగార్జున... సినీ పరిశ్రమలోని సమస్యలు ఈ సమావేశంతో ఓ కొలిక్కి వస్తాయని నాగార్జున అభిప్రాయపడ్డారు. జగన్ అపాయింట్ మెంట్ ఇచ్చారని వారం రోజుల కిందటే చిరంజీవి తనకు చెప్పారని, సినీ పరిశ్రమలో నెలకొన్న పరిణామాలపై తరచూ ఇద్దరం మాట్లాడుకుంటున్నామని నాగ్ పేర్కొన్నారు.  ఇక విజయవాడ చేరుకున్న మెగాస్టార్ కూడా.... సీఎం పిలువడం వల్లే వచ్చానని, సినిమా బిడ్డగా చిత్ర పరిశ్రమలోని సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. 

Post a Comment

Previous Post Next Post