సినిమా టికెట్ ధరల పెంపునకు ఏపీ సీఏం దాదాపు గ్రీన్ సిగ్నల్ !


ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ ధరల పెంపునకు ముఖ్యమంత్రి జగన్ సానుకూలంగా స్పందించినట్లు మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. ఇటీవల ప్రభుత్వం నియమించిన కమిటి తుది నిర్ణయం మేరకు నెల రోజుల్లో కొత్త  ఉత్తర్వులు వస్తాయని చిరంజీవి తెలిపారు. టికెట్ ధరల వివాదం, సినీ పరిశ్రమలోని సమస్యలపై ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకు క్యాంపు కార్యాలయంలో జగన్ తో చిరంజీవి ఏకాంతంగా సమావేశమయ్యారు. సుమారు గంటన్నరపాటు సమావేశమైన ఇరువురు... సినీ పరిశ్రమకు, ప్రభుత్వానికి మధ్య నెలకొన్న పరిణామాలపై చర్చించారు. అనంతరం హైదరాబాద్ కు తిరుగు ప్రయాణంలో విమానాశ్రయం వద్ద చిరంజీవి మాట్లాడుతూ....

- " సీఎం జగన్ తో సమావేశం చాలా సంతృప్తికరంగా ఉంది
- పండుగపూట సోదరుడిగా ఆహ్వానించి రుచికరమైన భోజనం పెట్టారు
- శ్రీమతి భారతిగారు స్వయంగా వడ్డించారు
- సినీ పరిశ్రమ ఆగమ్యగోచరంగా ఉంది. సమస్య జఠిలం అవుతుంది
- జగన్ పిలిచి రెండు వైపుల సమస్యలు వినాలన్నారు
- జగన్ పిలుపు నాకు బాధ్యతగా అనిపించింది
- పరిశ్రమలోని సమస్యలను అన్ని రకాలుగా వివరించా
- కమిటీ తుది నిర్ణయం తీసుకుందని చెప్పారు
- సినీ కార్మికుల్లో పూట గడవని పేదలెందరో ఉన్నారు. వాళ్ల గురించి ఆలోచించాల్సిన బాధ్యత ఉంది
- థియేటర్ ల సమస్యలపై కూడా సవివరంగా వివరించాను
- అందరికి ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటానన్నారు
- సిఎం మాటలతో నాకు ధైర్యాన్ని వచ్చింది
- సినిమా పెద్దగా కాకుండా బిడ్డగా చెబుతున్నా. సినీ పరిశ్రమలోని వ్యక్తులు నోరు జారొద్దు.
- ఈ వారం పదిరోజుల్లో కొత్త జీవో వస్తుంది
- చిన్న సినిమాలపై కూడా ఆలోచించి ఐదో ఆటకు అనుమతి ఇస్తానన్నారు
- సినీ పరిశ్రమలోని నిర్మాతలు, ఎగ్జిబిటర్లు అందరితోనూ మాట్లాడుతానన్నారు
- మరోసారి ఒక్కరిని రమ్మంటే ఒక్కడినే వెళ్తాను, 100 మంది రమ్మంటే 100మందితో వెళ్తా
- ఏపీ ప్రభుత్వానికి, సినీ పరిశ్రమకు మధ్య నెలకొన్న వివాదం ముగిసినట్టే

Post a Comment

Previous Post Next Post