సినిమా టికెట్ ధరల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారం రోజుల్లో కొత్త జీవోను జారీ చేస్తుందని మెగాస్టార్ చిరంజీవి ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలపై అందరితో కలిసి ముఖ్యమంత్రి జగన్ మరోసారి మాట్లాడుతానని చెప్పారు. అప్పటి వరకు సినీ పరిశ్రమలోని వ్యక్తులేవరూ నోరు జారవద్దని సినిమా బిడ్డగా మెగాస్టార్ హితవు పలికారు. త్వరలోనే అందరికి ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుందని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ తో సమావేశం ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన చిరంజీవి... వన్ టూ వన్ మాత్రమే చర్చ జరిగిందని తెలిపారు. ఆ చర్చలో మాట్లాడిన వివరాలను వెల్లడించిన చిరంజీవి... సినీ పరిశ్రమకు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్య నెలకొన్న వివాదాలు ఇక ముగిసినట్లేననే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
వెళ్లారు.. జీవోను మార్పించారు... దటీజ్ మెగాస్టార్
DS
0
Post a Comment