నేచురల్ స్టార్ నాని నిర్మించిన HIT మూవీతో దర్శకుడిగా పరిచయమై తొలి విజయాన్ని అందుకున్న డైరెక్టర్ శైలేష్ కోనేరు. ఇప్పుడు హిట్ ను బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నాడు. అంతేకాకుండా అడవిశేషుతో HIT 2ను కూడా పట్టాలెక్కించాడు శైలేష్ . సినిమా డైరెక్టర్ గానే కాదు బయట కూడా ఎంతో చలాకీగా ఉండే శైలేష్ కు రకరకాల అభిరుచులు ఉన్నాయి. క్రికెట్ ఆడటం, పాటలు పాడటం, స్పోర్ట్స్ బైక్స్ నడపడం శైలేష్ కు మహా ఇష్టం. అయితే తనకు ఎప్పటి నుంచో ఒక మంచి Rx100 బైక్ తీసుకోవాలని. కానీ ఆ కల ఇప్పుడు నెరవేరడం కష్టం. ఆ మోడల్ తయారీ ఆగిపోయింది. అయితే ఏం చేయాలని ఆలోచించిన డైరెక్టర్ శైలేష్ .... కస్టమైజ్డ్ గా Rx100 బైక్ తయారు చేయించుకోవాలని తపించాడు. నగరంలో ప్రముఖ స్టంటర్ ఇమ్రాన్ ను సంప్రదించాడు. శైలేష్ చెప్పిన సూచనలతో తక్కువ ధరలోనే అదిరిపోయే మోడల్ లో Rx100 బైక్ తయారు చేసి ఇచ్చాడు. ఆ బైక్ చూసిన శైలేష్ ... తెగ సంతోషపడ్డాడు. 90ల్లో పుట్టిన ప్రతి కుర్రాడి కలల బైక్ ఇదని పేర్కొన్న శైలేష్ ... ఇన్నాళ్లకు తన కల నెరవేరినందుకు ఆనందంగా ఉందన్నాడు. ఈ బైక్ లోని ప్రతి పార్ట్ ను తన అభిరుచికి తగినట్లుగా తయారుచేసి ఇచ్చిన రైడర్ ఇమ్రాన్ ను శైలెష్ కృతజ్ఞతలు తెలిపారు.
Post a Comment