బాలయ్య, ప్రభాస్ తో తారక్ సినిమా

 


తెలుగు సినిమా ఇక నుంచి మల్టీస్టారర్ల మయం కాబోతుందని జూనియర్ ఎన్టీఆర్ జోస్యం చెప్పారు. RRR లో రామ్ చరణ్ తో కలిసి నటించిన తారక్... తమ స్నేహానికి నిదర్శనం RRR అన్నారు. RRR స్ఫూర్తితో తెలుగులో మరిన్ని మల్టీస్టారర్ సినిమాలు రాబోతున్నాయని తెలిపారు. తాను కూడా మల్టీస్టారర్ సినిమా చేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ప్రకటించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు కాలంలో ఎన్నో మంచి కథలు మల్టీ స్టారర్లుగా వచ్చి ఘన విజయాలు అందుకున్నాయని గుర్తుచేసిన తారక్... తాను కూడా తోటి నటులతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉందని తెలిపారు. మహేశ్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్, బాలకృష్ణ, చిరంజీవి తోపాటు తన స్నేహితులందరితోనూ మంచి కథలు చేయాలని ఉందని తన మనసులో మాటను బయటపెట్టారు. అయితే వాటికి రాజమౌళి లాంటి దర్శకులు అవసరమని తారక్ చెప్పడం విశేషం. ఇదే జరిగితే ఇక టాలీవుడ్... హాలీవుడ్ ను అవలీలగా బీట్ చేయడం ఖాయం. బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురుస్తుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. 

Post a Comment

Previous Post Next Post