3Dలో RRR

 


ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రేక్షకులు నాలుగేళ్లుగా ఎదురుచూస్తోన్న సినిమా RRR. ఇప్పటికే 5 సార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ మూవీ ఎట్టకేలకు మార్చ్ 25న భారీ స్థాయిలో విడుదల కాబోతుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ప్రేక్షకులకు రాజమౌళి ఊహించని మరో సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నాడు. కరోనా వల్ల సినిమా వాయిదా పడటంతో దొరికిన సమయాన్ని సద్వినియోగం చేసుకొని RRR ను 3D రూపంలోనూ తీర్చిదిద్దారు.  మార్చి 25 నుంచి 3డీలో ప్రదర్శించేందుకు అనుకూలంగా ఉన్న థియేటర్లలో RRR 3Dలో చూడొచ్చు. సాధారణ థియేటర్ల సినిమా కంటే 3Dలో RRR మరింత విజువల్ వండర్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే RRR ను ఐమాక్స్, డాల్బీ ఫార్మెట్ లో సిద్ధం చేసిన జక్కన్న.... ముందే ఊహించి షూటింగ్ సమయంలోనే 3Dలోకి మార్చుకునే విధంగా సినిమాను డిజైన్ చేసి పెట్టాడు. యితే 3Dలో RRR చూడాలంటే సాధారణ థియేటర్ లో టికెట్ కంటే రెండు రెట్లు అధికంగానే టికెట్ ధరలు ఉంటాయని తెలుస్తోంది.

Post a Comment

Previous Post Next Post