బెల్లంకొండ తండ్రీ కొడుకులపై పోలీసు కేసు

 


ప్రముఖ సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్, ఆయన కుమారుడు, ప్రముఖ హీరో బెల్లకొండ శ్రీనివాస్ పై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు ఇద్దరిపై సీసీఎస్ పోలీసులు కేసు ఫైల్ చేశారు. 


కారణం ఏంటంటే... ప్రకాశం జిల్లాకు చెందిన వీఎల్ శరణ్  కుమార్ బంజారాహిల్స్ లో నివాసం ఉంటున్నాడు. మలినేని గోపిచంద్ దర్శకత్వంలో తన కుమారుడితో తీయబోయే చిత్రానికి సహ నిర్మాతగా ఉండటానికి 2018 శరణ్  వద్ద సురేష్ విడతల వారీగా రూ.85 లక్షల తీసుకున్నాడు. ఆ సినిమా తెరకెక్కలేదని, నమ్మించి మోసం చేశారని బాధితుడు శరణ్  నాంపల్లి కోర్టును ఆశ్రయించాడు. శరణ్ వాదనలు విన్న న్యాయస్థానం... బెల్లంకొండ సురేష్ తోపాటు ఆయన కుమారుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ పై కేసు నమోదు చేయాలని సీసీఎస్ పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు బెల్లంకొండ సురేష్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పై సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

Previous Post Next Post