రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన అద్భుత దృశ్యకావ్యం రాధే శ్యామ్. మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు అన్నిచోట్ల నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ప్రభాస్, పూజాల ప్రేమ కథకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. అయితే ఈ సినిమా చూసి ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారంటే ప్రధానంగా 10 కారణాలున్నాయి. అవేంటంటే...
2. ప్రభాస్ లుక్స్ & స్టైలింగ్:
నిన్న మొన్నటి వరకు మాస్ యాక్షన్
హీరోగా నటించిన రెబల్ స్టార్ ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా కోసం అమ్మాయిల కలల
రాకుమారుడిగా మారిపోయాడు. ఆయన లుక్స్, స్టైలింగ్ ఈ
సినిమాకు ప్రధాన ఆకర్షణ. ప్లటింగ్ చేస్తూ అమ్మాయి మనసు దోచుకోవడమే కాకుండా ఫ్యూచర్
చెబుతూ ఎంతో హుందాగా కనిపించాడు. బాహుబలి ఛాయలు ఎక్కడా కనిపించకుండా కొత్త లుక్ తో
ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నాడు.
3. లీడ్ పెయిర్ మధ్య కెమిస్ట్రీ:
ఏదైనా ప్రేమకథ సక్సెస్ అవ్వాలంటే ముందుగా కెమిస్ట్రీ బాగుండాలి. రాధే శ్యామ్ సినిమా విషయంలో ఇది పర్ఫెక్ట్ గా సెట్ అయింది. ప్రభాస్, పూజ హెగ్డే మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా వర్కవుట్ అయింది. ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. నువ్వేమైనా రోమియోవా అంటే... కాదు వాడు ప్రేమకోసం చచ్చిపోయాడు, నేను ఆ టైపు కాదంటూ అమ్మాయి ప్రేమను గెలుచుకుంటాడు. తన ప్రేమతో ప్రేరణకు ఊపిరి పోస్తాడు.
4. విజువల్ ఎఫెక్ట్స్ & ఆర్ట్ వర్క్:
రాధే శ్యామ్ సినిమాకు మరో ప్రధానమైన ఆకర్షణ ప్రొడక్షన్ డిజైనర్ రవీందర్ రెడ్డి తీర్చిదిద్దిన ఆర్ట్ వర్క్. ఇటలీ, లండన్ నేపథ్యంగా సాగే రాధేశ్యామ్ కథ కోసం ఆర్ట్ డిపార్ట్ మెంట్ చాలా అద్భుతమైన సెట్స్ వేసింది. సినిమా అంతా చాలా అందమైన సెట్లు కనిపిస్తాయి. వాటికి తోడు విజువల్ ఎఫెక్ట్స్ ను మలిచిన విధానం కన్నులవిందుగా ఉంటుంది. విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో నిర్మాతలు పెట్టిన ఖర్చు ప్రతి ఫేమ్ లో కనిపిస్తుంది. అలాగే సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస తన కెమెరాతో చేసిన మ్యాజిక్ అత్యద్భుతం. ప్రతి సన్నివేశాన్ని ఓ అందమైన కవితలా చిత్రీకరించారు.
5. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం &
తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్:
లవ్ స్టోరీలో ప్రేక్షకులు లీనమవ్వాలంటే
ప్రధానంగా సంగీతం ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ విషయంలో రాధేశ్యామ్ కు బలంగా మారారు
సంగీత దర్శకులు జస్టిన్ ప్రభాకరన్, తమన్. జస్టిన్ అద్భుతమైన పాటలు అందించాడు.
చివరి క్షణాల్లో ప్రాజెక్ట్ ను టేకోవర్ చేసి సినిమాకు బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చిన
తమన్... సినిమాను మరోస్థాయికి చేర్చాడు. తమన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ ప్రతి
సన్నివేశాన్ని హైలెట్ చేస్తూ ప్రధాన సినిమా విజయంలో కీలకంగా నిలిచింది.
6. రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్:
జిల్ లాంటి ఒకే ఒక సినిమా అనుభవం ఉన్న దర్శకుడు రాధాకృష్ణ కుమార్.. ఇలాంటి భారీ బడ్జెట్ పాన్ ఇండియా స్థాయిలో లవ్ స్టోరీని బాగా హ్యాండిల్ చేశాడు. ఒకవైపు ప్రభాస్ ఇమేజ్ బ్యాలెన్స్ చేసుకుంటూ.. మరోవైపు తాను రాసుకున్న కథకు సరిగ్గా న్యాయం చేశాడు. విధి రాత మన చేతుల్లో ఉండదు.... చేతల్లో ఉంటుందనే విషయాన్ని ప్రేమ కథకు ముడిపెట్టిన విధానం బాగుంటుంది. విక్రమాదిత్య, ప్రేరణ మధ్య వచ్చే లవ్ సీన్స్, క్లైమాక్స్ ను చాలా అద్భుతంగా మలిచాడు. రాధా రాసిన మాటలు కూడా బాగా ఆకట్టుకుంటాయి.
7. ట్రేన్ ఎపిసోడ్, ట్రాఫిక్ సీన్, బస్సు అద్దాలపై రాతలు
రాధేశ్యామ్ లో ప్రేరణ, విక్రమాదిత్య పాత్రలు ఒకరినొకరు కలిసే సన్నివేశం చాలా బాగా డిజైన్ చేశారు. కలలో కూడా కలవని ఈ ఇద్దరిని ప్రకృతి ఎలా కలిపిందనే రాజమౌళి పాటలతో సీన్ డిజైన్ చేసిన రాధాకృష్ణ.... ట్రైన్ లో నా బరువు మోయగలవా అంటూ విక్రమాదిత్యను అడగడం, విక్రమాదిత్య ప్రేరణను ట్రేన్ డోర్ నుంచి బయటికి దూకి చూడటం విజువల్ ఫీస్ట్ గా మలిచారు. అలాగే స్కూల్ బస్సులో ట్రాఫిక్ జామ్ టైమ్ లో బస్సు అద్దాలపై ఒకరికొకరు రాయడం ప్రత్యేక ఆకర్షణ.
8. హెయిర్ పిన్ ఎపిసోడ్
ప్రేరణతో డేట్ లో ఉన్న విక్రమాదిత్య.. ఒక రోజు ప్రేరణకు ఎంతో ఇష్టమైన హెయిర్ పిన్ దూరమవుతుంది. దాన్ని వెతికి తెచ్చి ఇచ్చే క్రమంలో హాస్పిట్ లో సీన్ వావ్ అనాల్సిందే. చిన్న హెయిర్ పిన్ కోసం దాని విలువ కట్టి చెప్పే విధానం బాగుంటుంది.
9. జ్యోతిష్యం కూడా శాస్త్రమే
ప్రపంచాన్ని నడిపిస్తుంది సైన్సే కాదు... శాస్త్రాలు కూడా అని పరమహంస పాత్రలో కృష్ణంరాజు చెప్పే సంభాషణలు ఆలోచింపజేస్తాయి. అయితే శాస్త్రాలలను 99 శాతం మంది నమ్ముతారని, ఒక శాతం మంది మాత్రమే తమను తాము నమ్ముకొని విధిరాతకు ఎదురెళ్లి జయిస్తారని చెబుతాడు. ఆ ఒక్కశాతంలో తాను కూడా ఉన్నానని గ్రహించిన విక్రమాదిత్య... తన ప్రాణాన్ని కాపాడుకొని ప్రేరణను ఎలా దక్కించుకున్నాడనే విషయం రాధేశ్యామ్ లో చక్కగా చూపించారు.
10. షిప్ ఎపిసోడ్...
రాధేశ్యామ్ లవ్ స్టోరీ మాత్రమేనని, ఫైట్లు, యాక్షన్ సన్నివేశాలు లేవని నిరుత్సాహాపడే అభిమానులకు... క్లైమాక్స్ లో వచ్చే షిప్ ఎపిసోడ్ చూస్తే ఒళ్లు జలదరిస్తుంది. తన ప్రాణాలను కాపాడుకొని ప్రేమను బతికించుకోడానికి ఇటలీకి షిప్ లో వెళ్లే విక్రమాదిత్యకు సునామీ లాంటి కష్టం ఎదురవుతుంది. పంచభూతాలన్నీ తన ప్రాణం తీసేందుకు ప్రయత్నిస్తాయి. కానీ తన సంకల్ప బలంతో విధికి ఎదురెళ్లి పోరాడి తిరిగొస్తాడు. అయితే నిజజీవితంలో ఇలాంటి సన్నివేశాలు ప్రేమికులకు ఎదురుకాకపోవచ్చు కానీ... ప్రతి సమస్యను ప్రేమికులు సునామీలాంటి కష్టంగానే భావిస్తారు. కానీ రాధేశ్యామ్ లో షిప్ ఎపిసోడ్ అద్భుతంగా తీర్చిద్దిన దర్శక నిర్మాతలు, యాక్షన్ కొరియోగ్రాఫర్ నిక్ పౌల్ కృషి అడుగడుగునా కనిపిస్తుంది.
Post a Comment