కింగ్ నాగార్జున, నాగచైతన్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం బంగార్రాజు. సొగ్గాడే చిన్ని నాయనా చిత్రానికి సీక్వెల్ గా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ మూవీ సంక్రాంతి బరిలో నిలిచి మంచి హిట్ టాక్ సంపాదించుకుంది. తెలుగు రాష్ట్రాల్లో క్లిష్ట పరిస్థితుల్లోనూ విడుదలైన తొలిరోజు నాగార్జున ఆశించిన స్థాయిలోనే ప్రేక్షకుల ఆదరణ పొందింది. అయితే బంగార్రాజుకు ఒవర్సీస్ లో ఫస్ట్ డేనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రింట్లు వెళ్లడం ఆలస్యం కారణంగా విదేశాల్లో బంగార్రాజు ప్రిమియర్స్ చాలా చోట్ల రద్దయ్యాయి. దీంతో అక్కడి వసూళ్లను బంగార్రాజు చేజార్చుకున్నాడు. అయితే ఈరోజు నుంచి యథావిధిగా అన్ని థియేటర్లలో బంగార్రాజు స్క్రీనింగ్ జరుగుతుందని అక్కడి డిస్ట్రిబ్యూటర్లు తెలిపారు.
Post a Comment