సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యలపై చర్చించేందుకు వెళ్తే దానికి రాజకీయ రంగు పులిమి ఉన్నది లేనిది లేనిది ఉన్నది రాస్తున్నారంటూ #GiveNewsNotViews పేరుతో చిరంజీవి చేసిన ట్వీట్ పై యువ హీరో విజయ్ దేవరకొండ స్పందించారు. చిరంజీవి ట్వీట్ కు తన సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు వెల్లడించారు. కరోనా లాక్ డౌన్ కారణంగా మధ్య తరగతి కుటుంబాలను ఆదుకునేందుకు విజయ్ మిడిల్ క్లాస్ ఫండ్ పేరుతో నిధులు సేకరించారు. ఆ నిధులపై గతంలో కొన్ని వెబ్ సైట్లు విజయ్ దేవరకొండకు వ్యతిరేకంగా రాశాయి. ఇండస్ట్రీలో విజయ్ గొప్పొడని చాటుకోవాలని చూస్తున్నాడంటూ విమర్శించారు. ఆ రాతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రత్యేక వీడియో విడుదల చేసిన విజయ్... సదరు వెబ్ సైట్లలో రాసిన వ్యక్తులపై మండిపడ్డారు. ఈ విషయంలో అప్పుడు మహేశ్ బాబు, నాగార్జున సహా మరికొంత మంది స్పందించి మద్దతు ప్రకటించారు. ఇప్పుడు తాజాగా చిరంజీవికి జగన్ పార్టీ రాజ్యసభ ఆఫర్ చేసిదంటూ వచ్చిన వార్తలను చిరంజీవి ఖండించిన క్రమంలో విజయ్ తన మద్దతు తెలుపుతూ ట్వీట్ చేశారు.
Post a Comment