మెగాస్టార్ చిరంజీవి, కొరాటల శివ కలయికలో ఫిబ్రవరి 4న విడుదల కావాల్సిన ఆచార్య వాయిదా పడింది. కరోనా కేసుల ఉద్ధృతి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చిత్ర బృందం తెలిపింది. త్వరలోనే కొత్త విడుదల తేదీ చెబుతామని ప్రకటించింది. దేవాలయాలతో పేరుతో జరిగే అవినీతి, అక్రమాలపై ఇద్దరు నక్సలైట్లు ఎలాంటి పోరాటం జరిపారనే కథాంశంతో ఆచార్యను కొరటాల రూపొందించారు. అయితే ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన చిత్రం మరోసారి వాయిదా పడటంతో మెగా అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా ఫిబ్రవరిలో విడుదల కావాల్సిన మేజర్ , ఖిలాడి, 18పేజీలు, భీమ్లానాయక్ చిత్రాలు కూడా వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Post a Comment