సమంతతో విడాకులు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో చెప్పిన చైతు

 

పరస్పరం సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతోనే సమంతతో విడాకులు తీసుకున్నానని నాగచైతన్య తెలిపారు. సమంత- చైతన్య విడాకులు తీసుకున్న తర్వాత తొలిసారిగా చైతూ స్పందించారు. ఇద్దరి మంచి కోసమే ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. బంగార్రాజు సినిమా విడుదల ప్రచారంలో ఉన్న చైతన్య... మీడియా అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. విడాకుల తర్వాత ఇద్దరం సంతోషంగా ఉన్నామని తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇద్దరికి మంచి జరగాలనే ఉద్దేశంతోనే విడాకుల నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్న చైతన్య... ఈ విషయంలో కుటుంబసభ్యుల మద్దతు ఎంతో ఉందన్నారు. అయితే ఇటీవల ఈ విషయంపై పరోక్షంగా స్పందించిన సమంత కూడా... శరీరానికే కాదు... మనసుకు కూడా గాయమవుతుందని వ్యాఖ్యానించడం పట్ల సమంత చైతూతో విడాకుల తర్వాత సంతోషంగా లేదని తెలుస్తోంది. చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. అయితే సమంత మాత్రం తన స్నేహితురాలు శిల్పారెడ్డితో కలిసి లాంగ్ టూర్లు, విహారయాత్రలకు వెళ్తూ తనలోని బాధను పైకి కనిపించకుండా దాచుకుంటోంది. కానీ ఏదో ఒక రోజు సమంత కూడా ఈ విషయంలో గట్టిగానే స్పందిస్తుందని తెలుస్తోంది. ప్రస్తుతం నాగచైతన్య నటించిన బంగార్రాజు ఈ సంక్రాంతికి విడుదలవుతుండగా సమంత నటించిన శాకుంతలం పోస్టు ప్రొడక్షన్ పనుల్లో ఉంది. 


Post a Comment

Previous Post Next Post