"భీమ్లానాయక్" లో "కేటీఆర్, కేసీఆర్"

 

పవన్ కళ్యాణ్, రానా నటించిన భీమ్లానాయక్ చిత్రం పవర్ స్టార్ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. భీమ్లానాయక్ గా పవన్, డానియల్ శేఖర్ గా రానా... నువ్వా నేనా అన్నట్లు పోటీపడి నటించిన తీరుపై ప్రశంసలు కురుస్తున్నాయి. అయితే ఈ చిత్రంలో కేకలు వేయించే మరో ప్రత్యేకత ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ తోపాటు కాంగ్రెస్ నేత మల్లు భట్టివిక్రమార్కల ప్రస్తావన కూడా రావడం విశేషం. ఇంతకీ వాళ్లనెందుకు భీమ్లానాయక్ లో ఉన్నారంటే.... 
" భీమ్లానాయక్ డానియల్ శేఖర్ ను అరెస్టు చేసి స్టేషన్ కు తీసుకొస్తారు. అక్కడ కానిస్టేబుళ్లు డానియల్ శేఖర్ కు సంబంధించిన ఫోన్, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకుంటారు. ఈ క్రమంలో స్టేషన్ లో కూర్చున్న డానియల్ శేఖర్ కు ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ వి.వి.వినాయక్ గారి పేరుతో రావడంతో స్టేషన్ లో ఉన్న పోలీసులంతా నవ్వుకుంటారు. సినిమా వాళ్లతో కూడా డానియల్ కు పరిచయాలున్నాయా అంటూ ఆటపట్టిస్తారు. డానియల్ శేఖర్ ఫోన్ తీసుకొని చెక్ చేస్తుంటారు. కాంగ్రెస్ నాయకుడు మల్లు భట్టివిక్రమార్క నెంబర్ కూడా ఉంటుంది. హీరోయిన్ కీర్తి సురేష్ నెంబర్ కూడా ఉందేమోనని వెతుకుతుండగా.... అందులో ఉన్న ఫోన్ నెంబర్లను చూసి అవాక్కవుతుంటారు. కేటీఆర్ పర్సనల్ నెంబర్ తోపాటు కేసీఆర్... అని చూడగానే అప్పటి వరకు డానియల్ ను అదో రకంగా చూసిన పోలీసులంతా భయపడుతూ చూస్తుంటారు. డానియల్ కు పెద్ద పెద్ద వాళ్లతో సంబంధాలున్నాయంటూ వెనకడుగు వేస్తారు. పోలీసుల భయాన్ని చూసిన డానియల్.... కేసీఆర్ అంటే ముఖ్యమంత్రి కాదని.... ఐజీ కె.చందన్ రావు అంటూ క్లారిటీ ఇస్తాడు."
ఈ సీన్ చూసిన ప్రేక్షకులు... కేకలు వేయకుండా ఉండలేరు. అంతలా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఆ సీన్ ను మలిచారు. ఈ ఒక్క సీనే కాదు... చాలా చోట్ల త్రివిక్రమ్ సంభాషణలు భీమ్లానాయక్ విజయంలో కీలకంగా నిలిచాయి.


Post a Comment

Previous Post Next Post