భీమ్లానాయక్ పై ఆర్జీవీ రివ్యూ

వివాదాస్పద వ్యాఖ్యాలు, వాస్తవిక సంఘటల ఆధారంగా సంచలన చిత్రాలకు కేంద్రంగా భావించే ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ... పవన్ కళ్యాణ్ గురించి తొలిసారిగా సానుకూలంగా స్పందించారు. పవన్ - రానా నటించిన భీమ్లానాయక్ చిత్రం ఓ సునామీగా అభివర్ణించారు. భీమ్లానాయక్ చిత్రంపై తనదైన శైలిలో రివ్యూ ఇచ్చిన వర్మ... తాను ఎప్పటి నుంచో చెబుతున్నట్లుగా భీమ్లాను హిందీలో విడుదల చేయాలని ఆర్జీవీ డిమాండ్ చేశారు. భీమ్లానాయక్ ఆర్జీవీ ఇంకా ఏమన్నారంటే....
" భీమ్లానాయక్' పిడుగు లాంటిది. పవన్ సునామీ లాంటివాడు. పవన్‌ కల్యాణ్​తో రానా పోటాపోటీగా నటించాడు. మొత్తానికి భీమ్లానాయక్ ఓ భూకంపం' "  నేను ఎప్పటినుంచో చెబుతున్నట్లుగా 'భీమ్లానాయక్‌' సినిమాను హిందీలోనూ రిలీజ్​ చేస్తే కచ్చితంగా సంచలనం సృష్టిస్తుంది"
       పవన్ కళ్యాణ్ పై పవన్ సినిమాలపై ఎప్పుడూ నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. ఈసారి పాజిటివ్​ కామెంట్స్​ చేయడం నెటిజన్లను, పవన్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

Post a Comment

Previous Post Next Post